08/01/2021 -అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ ప్రాంగణములో సుమారు 16 లక్షల రూపాయల వ్యయంతో నూతనముగా నిర్మించిన హోమశాలను స్థానిక శాసన సభ్యులు గౌ. శ్రీ కొండేటి చిట్టిబాబు వారు ప్రారంభించినారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి హోమం పూజా కార్యక్రమములో పాల్గొని పూర్ణాహుతి సమర్పించినారు. తొలుత కార్యనిర్వహణాధికారి వారు ఆద్వర్యములో ప్రధాన అర్చకులు, వేదపండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందజేసినారు. ఈ కార్యక్రమములో అంబాజీపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్, స్థానిక నాయకలు, గ్రామ పెద్దలు పాల్గొనియున్నారు.మములో అంబాజీపేట మార్కెట్ యార్డ్ ఛైర్మన్, స్థానిక నాయకలు, గ్రామ పెద్దలు పాల్గొనియున్నారు.
తూ.గో.జిల్లా అయినవిల్లి మండలం మరియు గ్రామములో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానము కార్యనిర్వహణాధికారిగా ఈ రోజు భాద్యతలు స్వీకరించిన శ్రీ పి.టి.వి.వి.సత్యనారాయణ మూర్తి (తారకేశ్వర రావు )గారు. వీరికి తొలుత ఆలయ అర్చకులు మరియు సిబ్బంది స్వాగతం పలకగా ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రముతో సత్కరించి, తీర్ధ ప్రసాదములు అందజేసినారు.
12-07-2019
METRO CHEEM API PVT Ltd, చైర్మన్ శ్రీ నందెపు వెంకటేశ్వర రావు, హైదరాబాద్ వారు ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళంగా రూ.51000/- ఇచ్చినారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, స్వామి వారి చిత్ర పటమును అందజేసినారు. వీరి వెంట zptc అన్నపూర్ణ దేవి, గంధం పల్లంరాజు, మద్దాల ఫణి గారు ఉన్నారు
17-12-2018
ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి 2019 సం. నూతన క్యాలెండర్ ను స్థానిక శాసన సభ్యులు గౌ. శ్రీ పి .నారాయణ మూర్తి గారు ఆవిష్కరించినారు . తొలుత కార్యనిర్వహణాధికారి వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శేష వస్త్రముతో సత్కరించినారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు స్థానిక శాసన సభ్యులు వారికి రెండు రకములు క్యాలెండర్ లను అందజేసినారు. ఈ కార్యక్రమములో ZPTC, MPP , MPTC సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు
14-12-2018
జై గణేష్ ...! జై జై గణేష్ ...!! అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానము నందు కార్తీక మాసం అనంతరం తెరువవలసిన హుండీలను ఈ రోజు అమలాపురం సబ్ డివిజన్ తనిఖీదారు వారి పర్యవేక్షణలో లెక్కించుట జరిగినది. 36 రోజులు నకు గాను రూ.15,23,187/-లు, అన్నదానం హుండీ ద్వారా రూ.71,701/- లు వెరసి మొత్తము హుండీ ఆదాయం రూ. 15,94,888/-లు వచ్చినది. ఈ లెక్కింపులో మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు , వాసవీ సేవాదళ సభ్యులు , విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారని తెలియపరచుచున్నాను సం /-కార్యనిర్వహణాధికారి
14-12-2018
కాకినాడ నకు చెందిన శ్రీ బండి రామానుజ రావు గారు కుటుంబ సభ్యులతో కలిసి అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు రూ.1,01,116/- విరాళముగా ఇచ్చినారు. వీరిని కార్యానిర్వహణాధికారి వారు ప్రత్యేకముగా అభినందించగా, ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రముతో సత్కరించినారు. అనంతరం అర్చకులు, ఆలయ సిబ్బంది స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు.
12-12-2018
26-11-2018
ఉపముఖ్యమంత్రి వర్యులు గౌ.శ్రీ చినరాజప్ప గారు వినాయక చవితి సందర్భముగా ఐనవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతముగా దర్శించినారు. కార్యనిర్వహనాధికారి వారు, ప్రధాన అర్చకులు పూర్ణ కుంభంతో స్వ్గాతం పలికినారు, అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసినారు. కార్యనిర్వహనాధికారి వారు శేష వస్త్రముతో సత్కరించినారు. చవితి ఉత్సవ ఏర్పాట్లు పై సంతృప్తి వ్యక్తం చేసినారు.
13-09-2018
వినాయక చవితి సందర్భముగా ఈ రోజు ఐనవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన స్థానిక శాసన సభ్యులు, శ్రీ పి.నారాయణ మూర్తి గారు మరియు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ రెడ్డి సుబ్బ్రహ్మణ్యం గారు వీరికి కార్యనిర్వహణాధికారి వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినారు, ప్రధాన అర్చకులు ఆద్వర్యములో వేద ఆశీర్వచనం అందజేసినారు. కార్యనిర్వహణాధికారి వారు శేష వస్త్రముతో సత్కరించినారు అనంతరం ఐనవిల్లి, శ్రీ విఘ్నేశ్వరుని స్వరాంజలి భక్తి గీతాలు సి.డి.ని ఆవిష్కరించినారు. మరియు పందిరిలో నెలకొల్పిన మట్టి వినాయకునిని సందర్శించినారు.
13-09-2018
జై గణేష్ ..! జై జై గణేష్ ...!! తూ.గో.జిల్లా, ఐనవిల్లి మండలం మరియు గ్రామములో వేంచేసియున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిదిలో ఈ రోజు హుండీలు లెక్కింపు మందపల్లి, శ్రీ శనేశ్వర స్వామి వారి దేవస్థానము అసిస్టెంట్ కమీషనర్, శ్రీ వి.వి.ఎస్.ఎన్.మూర్తి పర్యవేక్షణలో జరిగినది. 96 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.29,21,547/-లు, అన్నదానం హుండీ ఆదాయం రూ.1,27,905/-లు, వెరసి మొత్తము హుండీ ఆదాయం రూ.30,49,452/- లు వచ్చినది. బంగారం 9.3 గ్రాములు, వెండి 192.8 గ్రాములు, మరియు విదేశీ కరన్సీ 6 నోట్లు వచ్చినవి. ఈ లెక్కింపు లో గ్రామస్తులు, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు కొత్తపేట వాసవి సేవాదళ సభ్యులు, కేశనపల్లి విశ్వహిందూ పరిషత్ సభ్యులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ
10-09-2018
అఖిల భారత బ్రాహ్మణ యువజన సంఘం అద్యక్షులు శ్రీ ద్రోణంరాజు రవికుమార్ గారు వారి మిత్రులు కలిసి ఈ రోజు ఐనవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించినారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికగా, ప్రధాన అర్చకులు ఆద్వర్యములో వేద ఆశీర్వచనం చేసినారు, కార్యనిర్వహణాధికారి వారు శేష వస్త్రముతో సత్కరించి, స్వామి వారి చిత్రపటమును అందజేసినారు.
22-08-2018
ఐనవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిదిలో ఈ రోజు చవితి ఉత్సవ ఏర్పాట్లు పై గ్రామ సభ నిర్వహించుట జరిగినది.ఈ సందర్భముగా ఉత్సవ 9 రోజులు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయములు కల్పించుటకు క్యూ లైన్ లో వచ్చే భక్తులకు పాలు, బిస్కెట్లు ఇచుటకు, శ్రీ స్వామి వారిని 9 రోజులు సాయంత్రం సమయమున నాలుగు మాడ వీధులు గుండా ఊరేగించుటకు మరియు లైటింగ్ ఏర్పాట్లు గురించి చర్చించినారు. గ్రామస్తులు అందరూ ఏకగ్రీవముగా తీర్మానించి, ఉత్సవ ఏర్పాట్ల పై పలు సూచనలు చేసినారు. ట్రాఫిక్ ను బై పాస్ రోడ్ గుండా మరలచుటకు, అంగీకరించినారు. - సం/- కార్యనిర్వహణాధికారి
06-08-2018
Pens Festival....
28-02-2018
హైదరాబాద్ నకు చెందిన శ్రీ ఆదిత్య హయగ్రీవ కళ్యాణ్ దంపతులు ఐనవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ.10,002/- యిచ్చినారు, వీరికి అర్చక వారులు స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేసినారు....
20-01-2018
ఆంధ్రప్రదేశ్ ఎస్.సి. ఎస్.టి. కమీషన్ చైర్మన్ శ్రీ కారెం శివాజీ గారు పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతముగా ఐనవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, ప్రత్యేక పూజ నిర్వహించినారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికగా, అర్చకులు వేద ఆశీర్వచనం అందించినారు, అనతరం కార్యనిర్వహణాధికారి వారు స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేసినారు. ...
25-12-2017
రాధాకృష్ణ కన్స్ట్రక్షన్స్, శ్రీ సాయి కిరణ్, రాజమహేంద్రవరం వారు ఈ రోజు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతముగా దర్శించిన సందర్భముగా శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాదట్రస్ట్ నకు విరాళముగా రూ.50,116/- డి.డి.ని కార్యనిర్వహణాధికారి వారికి అందజేసినారు. అనంతరం వీరిని అభినందించి స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు...
13-11-2017
ఆగమ శాస్త్రము ప్రకారము ది.20-11-2017, ఉ. గం.11-05 ని,లకు శ్రీ స్వామి వారిని మూషిక వాహనము పై నాలుగు మాడ వీదిలు గుండా ఊరేగించుటకు పండితులు ముహూర్తం నిర్ణయించినారు...
20-11-2017
కాకినాడ, వాస్తవ్యులు శ్రీ సి. హెచ్ రామసోమయజి శర్మ దంపతులు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు వారి కుమారుడు సి.హెచ్ ఫణీంద్ర కుమార్ పేరు మీద రూ.10,116/- విరాళం గా ఇచ్చినారు. వీరికి ప్రధాన అర్చకులు స్వామి వారి చిత్రపటాన్ని అందజేసినారు...
23-10-2017
జై గణేష్ ...! జై జై గణేష్ ...!! ఈ రోజు ఐనవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిదిలో నెల వారి తెరువవలసిన హుండీ లెక్కింపు జరిగినది. 45 రోజులునకు గాను హుండీ ఆదాయం రూ. 12,56,487/-, మరియు అన్నదానము హుండీ రూ.50,680/- వెరసి మొత్తం రూ.13,07,167/- వచ్చినది. ఈ లెక్కింపు దేవాదాయ-ధర్మాదాయ శాఖ, అమలాపురం డివిజనల్ అధికారి శ్రీ జి.సత్య వరప్రసాద్ పర్యవేక్షణలో జరిగినది. ఆలయ కార్యనిర్వహణాధికారి వారు, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు, మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు...
21-10-2017
హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ కొల్లి సత్యనారాయణ రెడ్డి మరియు వారి సన్నిహితులు ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ. 1,00,000/- యిచ్చినారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, తీర్ధ, ప్రసాదములు అందజేయగా, కార్యనిర్వహణాధికారి వారు వీరిని అభినందించినారు, అనంతరం ఆలయ చైర్మన్, మరియు సభ్యులు వీరిని సత్కరించి, స్వామి వారి చిత్రపటమును అందజేసినారు...
11-09-2017
తూ.గో.జిల్లా, అల్లవరం మండలం, గోపాయిలంక వాస్తవ్యులు శ్రీ తోరం రాము కుటుంబ సభ్యులు చవితి మహోత్సవములు సందర్చముగా ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ. 50,001/- యిచ్చినారు. వీరిని కార్యనిర్వహణాధికారి వారు అభినందించి, కండువాతో సత్కరించి, స్వామి వారి చిత్రపటమును అందజేసినారు...
31-08-2017
గుంటూరు నకు చెందిన శ్రీ బేతనభట్ల శ్యామ్ సుందర్ గారు సతీసమేతముగా ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ.1,00,232/- యిచ్చినారు. వీరికి ప్రధాన అర్చకులు సురేష్ గారు వేద ఆశీర్వచనం చేసి, తీర్ధ ప్రసాదములను అందజేసి
శ్రీ స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు. వీరని ఆలయ కార్యనిర్వహణాధికారి వారు అభినందించినారు...
19-08-2017
వినాయక చవితి ఉత్సవ 9 రోజులు ఏర్పాట్లు గురించి, ఐనవిల్లి ఎస్సై గారు, ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ కార్యనిర్వహణాధికారి వారితో చర్చించుట జరిగినది. ఈ సందర్భముగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా మొదటి రోజు 30 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు, మరియు ఆఖరు రోజు ఊరేగింపు నకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు కార్యనిర్వహానాదికారి
వారికి వివరించినారు. అదేవిదముగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉత్సవ 9 రోజులు నాలుగు చక్ర వాహనములు బై పాస్ రోడ్ మార్గము వైపు మళ్ళించబడును అని, దీనికి భక్తులు, గ్రామస్తులు అందరూ
సహకరించవలసినదిగా కోరచున్నాము అని చెప్పినారు...
21-08-2017
హైదరాబాద్ వాస్తవ్యులు, శ్రీ నాగ భాస్కర విశ్వనాద్ గారు ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ.10,350/- యిచ్చినారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు స్వామి వారి చిత్రపటమును ప్రసాదములను అందజేసినారు....
05-08-2017
ఈ రోజు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్ధానము కార్యనిర్వహనదికారిగా భాద్యతులు స్వీకరించిన శ్రీ మాచిరాజు లక్ష్మినారాయణ గారు, వీరికి ఆలయ అర్చకులు,సిబ్బంది స్వాగతం పలికినారు....
28-07-2017
రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీ సుధా చైతన్య ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ వారు ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి 750 గ్రా. వెండి బిందెను విరాళముగా ప్రధాన అర్చకులు సురేష్ గారికి అందజేసినారు. విలువ సుమారు రూ.30,000/- లు వీరికి స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు....
28-07-2017
రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ యాగ సాయి శ్రీనివాస్, ధనలక్ష్మి దంపతులు ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి 24 కి.గ్రా వెండి మూషిక వాహనము (వీటి విలువ సుమారు 14 లక్షలు రూపాయలు) ను చేయించి యిచ్చినారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, శేష వస్త్రముతో సత్కరించినారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు వీరిని సత్కరించి, స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేసినారు. వీరిని పలువురు అభినంధించినారు. ఈ కార్యక్రమము ఆలయ పర్యవేక్షనాదికారి వారి సమక్షములో జరిగినది.....
03-07-2017
స్ధానిక శాసన సభ్యులు గౌ.శ్రీ పి.నారాయణ మూర్తి గారు, వారి కుమారుడు శ్రీ రవిబాబు గారు ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించినారు. వీరికి ఆలయ చైర్మన్, కార్యనిర్వహణాధికారి వారు స్వాగతము పలికగా, ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేసినారు, అనంతరం ఆలయ చైర్మన్ శేష వస్త్రముతో సత్కరించి, ప్రసాదములను అందజేసినారు. వీరి వెంట స్దానిక నాయకులు ఉన్నారు.....
06-06-2017
అయినవిల్లి పెదపాలెం వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ పిల్లి సత్యనారాయణ, మంగాదేవి దంపతులు ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో వారి కుమారుడు రవితేజ మొదటి జీతమును శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ.10,116/- యిచ్చినారు, వీరికి అర్చకులు వారు తీర్ధ ప్రసాదములను, స్వామి వారి చిత్రపటమును అందజేసినారు. వీరి వెంట శ్రీ పిల్లి శేఖర్, గుత్తుల నాగబాబు ఉన్నారు....
10-04-2017
శ్రీ స్వామి సన్నిదిలో ఉగాది సందర్భముగా పంచాంగ శ్రవణం ఘనముగా నిర్వహించినారు. పంచాంగ కర్తగా శ్రీ వారణాసి సుబ్రహ్మణ్యం వ్యవహరించినారు. ధర్మకర్తలు గ్రామస్తులు, మరియు భక్తులు పాల్గొన్నారు...
29-03-2017
Sri Vighneswaraswamy Devastanam, Ainavilli
29-03-2017
బండారులంక గ్రామ వాస్తవ్యులు శ్రీమతి గంటి సుబ్బలక్ష్మి గారు ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు వారి తల్లితండ్రులు కీ.శే. తాతా కామేశ్వర రావు, సత్యవతి దంపతులు పేరు మీద విరాళముగా రూ.1,00,000/- అందజేసినారు, అనతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా , ఆలయ చైర్మన్ శ్రీ సుబ్బరాజు గారు స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేసినారు. వీరిని పలువురు అభినంధించినారు....
22-02-2017
శ్రీమతి & శ్రీ నల్లా సూర్య ప్రకాశ రావు, హైమా దంపతులు ఈ రోజు రధసప్తమి సందర్భముగా అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాలముగా రూ.1,00,001/- చెక్కును కార్యనిర్వాహణాధికారి వారికి అందజేసినారు. అనతరం శేష వస్త్రముతో సత్కరించగా, ఆలయ చైర్మన్ వారు శ్రీ స్వామి వారి చిత్రపటమును అందజేసినారు, వీరిని ZPTC దంపతులు అభినంధించినారు.....
03-02-2017
తూ.గో.జిల్లా, కొత్తపేట వాస్తవ్యులు శ్రీ ముత్యాల సూర్యనారాయణ గారు, ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర
స్వామి వారిని దర్శించిన సందర్భములో కీ.శే. ముత్యాల మాణిక్యాంబ, దొరయ్య దంపతులు
పేరు మీద నిత్య అన్నదానము నందు భక్తులు కూర్చొనేందుకు 56 kg బరువు గల స్టీల్ బెంచ్
నిమిత్తం రూ.25,000/- విరాళముగా యిచ్చినారు. అనంతరం ఆలయ చైర్మన్, కార్యనిర్వహనదికారి వారు వీరిని అభినందించి స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేసినారు.....
28-01-2017
ప.గో.జిల్లా, ఏలూరు వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ ఆల సావిత్రి వెంకట రావు దంపతులు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రు.58001/- యిచ్చినారు, వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, తీర్ధ ప్రసాదములను అందజేయగా, ఆలయ
చైర్మన్ శ్రీ సుబ్బరాజు గారు శేష వస్త్రముతో సత్కరించి, స్వామి వారి చిత్రపటమును అందజేసినారు....
19-01-2017
రాజమహేంద్రవరం వాస్తవ్యులు శ్రీ ఎం.రామ నాగేంద్ర వెంకట సోమేశ్వర స్వామి వారు కుటుంబ సమేతముగా అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో సుమారు రూ.65,000/- విలువ చేసె 53 బంగారు పుష్పములను ఆలయ ధర్మకర్త శ్రీ వీరంశెట్టి గారికి అందజేసినారు. అనంతరం స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేసినారు...
05-01-2017
నగదు రహిత లావాదేవీలు ప్రోత్సాహించడానికి కార్యనిర్వహణాధికారి వారు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిదిలో భక్తులు సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన paytm మిషన్ ద్వారా దర్శనం టిక్కెట్లు తీసుకుంటున్న భక్తులు ..
09-12-2016
హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి పసుపులేటి రత్నవల్లి గారు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ.10,116 లు చెక్కును యిచ్చినారు. అనతరం ఆలయ అర్చకులు శ్రీ మాచరి రాజేశ్వర రావు గారు వేద ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదములను స్వామి వారి చిత్రపటమును అందజేసినారు..
5-12-2016
అమలాపురంనకు చెందిన బంగారు నగలు వ్యాపారి శ్రీ సయత్ భావరలాల్ శర్మ గారు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రు.1,00,000/- కార్యనిర్వాహనధికారి వారికి అందజేసినారు. వీరిని అభినందించి, శ్రీ స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు...
8-11-2016
అయినవిల్లిలంక నందు గల సర్వే నెం.142/10 లో య.0-48 సెంట్లు మెరక భూమిని కాకినాడ వాస్తవ్యులు శ్రీమతి ఆకెళ్ళ భాస్కర రాజ్యలక్ష్మి ,శ్రీమతి వేపా లక్ష్మి సుభద్ర వారులు వారి పూర్వికులు నుండి సంక్రమించిన సుమారు రు.15 లక్షలు విలువ చేసే భూమిని అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి దానపట్టాను ఆలయ ధర్మకర్తలు ద్వారా అందజేసినారు. వీరిని ఆలయ మర్యాదలతో సత్కరించి, శ్రీ స్వామి వారి చిత్రపటమును అందజేసినారు. వీరిని ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మరియు గ్రామస్తులు అభినందించినారు..
7-11-2016
విశాఖపట్నం వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ పెరిచర్ల రామ జోగి శ్రీనివాస రాజు, పూర్ణిమ దంపతులు, అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ నకు రూ.1,00,000/- విరాళముగా యిచ్చినారు. వీరికి అర్చకులు వేద ఆశీర్వచనం చేసి, తీర్ధ ప్రసాదములను అందజేయగా, ఆలయ చైర్మన్ శ్రీ సుబ్బరాజు గారు శేష వస్త్రముతో సత్కరించి, స్వామి వారి చిత్రపటమును అందజేసి అభినందించినారు..
28-10-2016
కాకినాడ వాస్తవ్యులు శ్రీ రావిపాటి విజయ మారుతీ రఘురాం గారు కుటుంబ సమేతముగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో వారి కుమార్తె రావిపాటి సాన్విత పేరు మీద నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రు.1,00,000/- ఆలయ చైర్మన్ సుబ్బరాజు గారికి అందజేశారు. వీరికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, శ్రీ స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేశారు. ఆలయ ధర్మకర్తలు, అప్పనపల్లి, బాల బాలాజీ ఆలయ కార్యనిర్వహణాధికారి వారు పాల్గొన్నారు....
25-09-2016
అయినవిల్లి విఘ్నేశ్వరుని దర్శించుకొన్న దేవదాయశాఖా మంత్రి వర్యులు పి.మాణిక్యాలరావు,ఎమ్మెసి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి గారు వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు స్వాగతం పలకగా, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసినారు. ఈ సందర్భముగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు శ్రీ కేసిరెడ్డి నాగ పాండు రంగారావు గారు మంత్రి గారి చేతులు మీదుగా రు.1,11,111/- చెక్కును ఆలయ చైర్మన్ గారికి అందజేసారు. ఈ కార్యక్రమములో ఆలయ ధర్మకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు...
16-09-2016
గంటి పెదపూడి గ్రామానికి చెందిన ప్రముఖ యువ వ్యాపార వేత్త శ్రీ మంతెన రావిరాజు గారు శ్రీ స్వామి వారిని దర్శించిన సందర్భములో నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ. 1,00,000/- లు చెక్కును ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తలు వారికి అందజేశారు.వీరిని కార్యనిర్వహణాధికారి వారు అభినందించినారు...
15-09-2016
జై గణేష......జై జై గణేష....! అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం నందు చవితి మహోత్సవంలు అనంతరం హుండీ లెక్కింపు ది.14-09-2016 న ఆలయ ధర్మ కర్తల మండలి వారి సమక్షములో, తణిఖీ దారు , అమలాపురం వారి పర్యవేక్షణలో జరిగినది, 10 రోజులకు గాను రూ.8,84,313/- వచ్చినది. గత సంవత్సరం హుండీ ఆదాయం 13 రోజులకు రూ. 8,08,138/- వచ్చింది..
14-09-2016
తణుకు వాస్తవ్యులు శ్రీ కలిశెట్టి శ్రీను గారు శ్రీవిఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో.... వీరు నిత్య అన్నదాన భవనం నందు రు. 2,25,000/- లను గతములో ఇచ్చియున్నారు. వీరికి అర్చక స్వాములు వేదఅశీర్వచనం చేసి, శ్రీ స్వామి వారి చిత్ర పటమును అందజేశారు...
13-09-2016
అమలాపురం మండలం, ఎ.వేమవరం గ్రామ వాస్తవ్యులు శ్రీ బొక్కా. శివ శంకర్ ప్రసాద్, సోమేశ్వరి దంపతులు వినాయక చవితి మహోత్సవలు సందర్భముగా శ్రీ స్వామి వారిని కుటుంబ సమేతముగా దర్శించి, నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ నకు ఒక్క రోజు విరాళముగా రు. 2,08,000/- లను ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులకు అందజేశారు. సుమారు 6,800 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించినారు. వీరికి స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు...
11-09-2016
తు.గో.జిల్లా, ఆలమూరు మండలం, కలవచర్ల వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ సత్యవోలు సుబ్రహ్మణ్యం, కృష్ణవేణి దంపతులు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో నిత్య అన్నప్రసాద ట్రస్ట్ నకు రు.25,116/- లను విరాళముగా కార్యనిర్వహణాధికారి వారికి అందజేశారు, స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేశారు..
06-09-2016
అయినవిల్లి గ్రామం, ముక్తేశ్వరం వాస్తవ్యులు శ్రీ కడలి వెంకట సత్యనారాయణ, శ్రీలక్ష్మి దంపతులు శ్రీ స్వామి వారిని దర్శించిన సందర్భములో, నిత్య అన్నప్రసాద ట్రస్ట్ నకు రూ. 1,01,116/- విరాళముగా ఆలయ చైర్మన్ శ్రీ సుబ్బరాజు గారికి అందజేశారు, వీరికి అర్చకులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదములు, శ్రీ స్వామి వారి చిత్రపటమును అందజేశారు, వీరిని పలువురు అభినందిన్చినారు..
04-09-2016
శ్రీ ఆకొండి సూర్య నారాయణ, శారద దేవి దంపతులు అమలాపురం వారు నిత్య అన్నప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ.50,000/- యిచినారు. వీరి తరుపున శ్రీ రామకృష్ణ, శైలజ దంపతులు శ్రీ స్వామి వారి సన్నిదికి వచ్చి ఈ విరాళమును అందజేశారు. వీరికి అర్చకులు స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేశారు..
07-07-2016
అయినవిల్లి మండలం, క్రాప గ్రామ వాస్తవ్యులు శ్రీ కడలి బాలకృష్ణ గారు అయినవిల్లి,
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో వారి కుమారుడు వెంకటేష్ బాబు ఇస్రో లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చిన సందర్భముగా తన మొదటి నెల జీతం రూ.36,682/- నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా యిచ్చినారు. వీరికి ఆలయ చైర్మన్ శ్రీ సుబ్బరాజు గారు స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేశారు. వీరి వెంట శ్రీ గుత్తుల నాగ బాబు ఉన్నారు..
06-07-2016
కాకినాడ నకు చెందిన శ్రీ గునిశెట్టి శ్రీనివాస్ రాజేష్, కృష్ణ వేణి దంపతులు ఈ రోజు అయినవిల్లి,శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ నకు విరాళముగా రూ.1,00,116/- లను ఆలయ చైర్మన్ శ్రీ సుబ్బరాజు గారికి అందజేశారు. వీరికి వేద ఆశీర్వచనం చేయించిన అనంతరం స్వామి వారి చిత్రపటమును
ప్రసాదములను అందజేశారు.
26-06-2016
కాకినాడ నకు చెందిన శ్రీ వడ్లమాని సుబ్బలక్ష్మి గారు ఈ రోజు అయినవిల్లి,
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి నిత్య అన్న ప్రసాద ట్రస్ట్ నకు వారి భర్త
కీ.శే. గున్నశ్వర రావు గారు పేరు మీద విరాళముగా రూ.1,00,000/- లను
ఆలయ చైర్మన్ శ్రీ సుబ్బరాజు గారికి అందజేశారు. వీరికి స్వామి వారి చిత్రపటమును,
ప్రసాదములను అందజేశారు.
24-06-2016
శ్రీ స్వామి వారి సన్నిదిలో హుండీ లెక్కింపు జరిగినది. 60 రోజులకు గాను
ఆదాయం రూ.15,29,085/-, బంగారం 4 గ్రా., వెండి 208 గ్రా. వచ్చినది.
ఈ లెక్కింపు దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి శ్రీ బి.వి. వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగినది. ఆలయ చైర్మన్, మరియు ధర్మకర్తల మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి వారు, ఆలయ సిబ్బంది మరియు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు కేశనపల్లి వారు పాల్గొన్నారు
30-05-2016
ఖమ్మం జిల్లా, మణుగూరు గ్రామానికి చెందిన శ్రీ కేతా వీర వెంకట సత్యనారాయణ,
కోటేశ్వరి దంపతులు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో
అన్న ప్రసాద ట్రస్ట్ కు విరాళముగా 10,411/- యిచినారు. అనంతరం కార్యనిర్వహనదికారి
వారు శ్రీ స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేశారు.
09-05-2016
తూ.గో. జిల్లా, రామచంద్రపురం వాస్తవ్యులు శ్రీమతి గరిగిపాటి లక్ష్మి దేవి గారు
కుటుంబ సమేతముగా శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి వారి భర్త కీ.శే. గరిగిపాటి శ్రీనివాసరావు వారి పేరు మీద నిత్య అన్నదాన పదకమునకు విరాళముగా రూ. 1,00,530/- యిచ్చినారు. వీరికి ఆలయ చైర్మన్ శ్రీ రావిపాటి సుబ్బరాజు గారు శేష వస్త్రముతో సత్కరించి, శ్రీ స్వామి వారి చిత్ర పటమును అందజేయగా, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ సూరిబాబు గారు వెదాశీర్వచనం చేసి, ప్రసాదములను అందజేశారు.
28-04-2016
నేదునూరు వాస్తవ్యులు కీర్తిశేషులు కళ్లె పల్లి చంద్రకాంతం గారి జ్ఞాప కార్ధం వారి మనుమలు కళ్లె పల్లి వంశీ కృష్ణ, చైతన్య కృష్ణ గారు యీ రోజు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి నిత్య అన్నదాన పధకం నకు విరాళంగా రూ. 1,00,000/- యీచ్చినారు. తొలుత ఆలయ చైర్మన్ శ్రీ సుబ్బరాజు గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శేష వస్త్రంలతో సత్కరించగా, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మాచరి సూరిబాబు గారు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదం అందచేసారు.
27-04-2016
ప.గో.జిల్లా. పెరవలి మండలం, కానూరు అగ్రహారం వాస్తవ్యులు శ్రీ దాసం నాగేంద్ర సూర్య
పవన్ కుమార్ గారు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో
నిత్య అన్నదాన పదకమునకు రూ. 1,00,000/- విరాళముగా యిచినారు. అర్చకులు
వెదాశీర్వచనం చేయగా, ఆలయ చైర్మన్ గారు స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేశారు.
10-04-2016
భీమవరం వాస్తవ్యులు శ్రీమతి&శ్రీ గంధం వెంకట విశ్వేశ్వర రావు, వెంకట ఉష
దంపతులు ఉగాది పర్వదినమున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి,
నిత్య అన్నదాన పదకమునకు విరాళముగా రూ.1,01,116/- యిచినారు.
వీరికి ఆలయ చైర్మన్,కార్యనిర్వహణాధికారి, వారు స్వామి వారి చిత్రపటమును
ప్రసాదములను అందజేశారు.వీరివెంట శ్రీ మద్దింశెట్టి రాము గారు ఉన్నారు..
08-04-2016
ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి హుండి లెక్కింపు ఆలయ తనిఖీ దారు
జంపా రామలింగేశ్వర రావు గారు పర్యవేక్షణలో జరిగినది. మొత్తం 50 రోజులకు
గాను రూ.13,84,069/- వచ్చినది. వెండి 260 గ్రా., బంగారం 03 గ్రా. వచ్చినది.
ఈ లెక్కింపులో ఆలయ ధర్మ కర్తలి మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి, ఆలయ
సిబ్బంది పాల్గొన్నారు..
31-03-2016
LIC, AAO అమలాపురం శ్రీ దాసరి సత్యనారాయణ గారు ఈ రోజు
అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి నిత్య అన్నదాన పదకమునకు
విరాళముగా రూ. 1,00,000/- యిచినారు. అర్చకులు వెదాశీర్వచనం చేయాగా
ఆలయ చైర్మన్ గారు స్వామి వారి చిత్ర పటమును ప్రసాదములను అందజేశారు.
14-03-2016
తూ.గో. జిల్లా., కొత్తపేట మండలం, అవిడి గ్రామానికి చెందిన శ్రీ లంక. సూర్య రావు
గారు ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ స్వామి వారి సన్నిదిలో జరుగుచున్న
నిత్య అన్నదాన పదకమునకు విరాళముగా రూ. 50,000/- యిచ్చినారు. వీరికి ప్రధాన
అర్చకులు వెదాశీర్వచనం చేసి, స్వామి వారి చిత్ర పటమును, ప్రసాదములను అందజేశారు.
10-03-2016
ఉపముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ చినరాజప్పగారు, స్ధానిక ఎం.ఎల్.ఎ. శ్రీ పి.నారాయణ
మూర్తి గారు విద్యార్థులకు కలములు పంపిణీ చేస్తున్న దృశ్యం
14-2-2016
గౌతమీ స్వీట్స్, ముక్తేశ్వరం, శ్రీ గుత్తుల నాగ భూషణం గారి కుమారుడు
శ్రీమతి & శ్రీగుత్తుల బాబిగారు శ్రీ స్వామి వారి అన్నదాన భవన నిర్మాణమునకు
రూ.10,116/- విరాళముగా యిచ్చినారు. వీరికి స్వామి వారి చిత్రపటమును,
ప్రసాదములను ఆలయ ప్రధాన అర్చకులు వారు అందజేశారు
13-2-2016
ప్రోటోకాల్ జడ్జి గౌ. శ్రీ కె.పి.బాలాజీ , రాజమండ్రి వారు ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి
వారిని దర్శించినారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినారు. కుటుంబ
సమేతముగా శ్రీ లక్ష్మీ గణపతి హోమం చేయించుకొన్నారు. అనంతరం ప్రసాదములను
అందజేశారు.
31-1-2016
రాజమండ్రి డి.ఎస్.పి., శ్రీ సాయి శ్రీనివాస్ గారు, ఈరోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర
స్వామి వారిని దర్శించినారు, వీరికి ఆలయ చైర్మన్ గారు స్వాగతం పలికి, ప్రసాదములను
అందజేశారు.
29-1-2016
ప.గో.జిల్లా, పెనుగొండ వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ కట్టా. వెంకటరత్నం, రామలక్ష్మి అరుణ
దంపతులు ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, నిత్య అన్నదాన పదకమునకు
విరాళముగా రూ. 50,000/- యిచ్చినారు. వీరికి ఆలయ చైర్మన్ గారు శ్రీ స్వామి వారి
చిత్రపటంను, ప్రసాదములను అందజేశారు..
23-1-2016
కాకినాడ వాస్తవ్యులు శ్రీమతి నెక్కంటి ఝాన్సీరాణి గారు ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర
స్వామి వారిని దర్శించిన సందర్భములో నిత్య అన్నదాన పధకమునకు విరాళముగా
రూ.50,000/- యిచ్చినారు. వీరికి వెదాశీర్వచనం చేసి, స్వామి వారి చిత్రపటంను,
మరియు ప్రసాదములను అందజేశారు.
21-1-2016
రామచంద్రపురం మండలం, ఉండూరు వాస్తవ్యులు శ్రీమతి చిగురుపాటి ఆదిలక్ష్మి,
వారి కుమారులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, అన్నదాన పదకమునకు
విరాళముగా రూ.25,000/- యిచ్చినారు. వీరికి ప్రధాన అర్చకులు స్వామి వారి
చిత్రపటమును, ప్రసాదములను అందజేశారు
18-1-2016
తూ.గో. జిల్లా, ఉప్పలగుప్తం వాస్తవ్యులు శ్రీ చిక్కం. సూర్యనారాయణ గారు
ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో
వారి కుమార్తె వీర వెంకట సత్యవాణి జ్ఞాపకార్ధం రూ.50,000/- విరాళముగా
నిత్య అన్నదాన పదకమునకు యిచ్చినారు. వీరికి ఆలయ సూపరింటెండెంట్
వారు స్వామి వారి చిత్రపతమును, క్యాలెండర్ను, మరియు ప్రసాదములను
అందజేశారు...
17-1-2016
తూ.గో.జిల్లా, ప్రత్తిపాడు కు చెందిన వ్యాపారవేత్త శ్రీ చెలంకూరి చలపతిరావు గారి
కుమారుడు సీతారామ చౌదరి గారు తన మొదటి జీతమును విరాళముగా రూ.28,000
శ్రీ స్వామి వారి దేవస్దానములో జరుగుతున్న నిత్యాన్నదాన పదకమునకు యిచినారు.
వీరికి ఆలయ సూపరింటెండెంట్ స్వామి వారి చిత్ర పటమును అందజేశారు..
16-1-2016
రశ్రీమతి ఈరంకి శ్యామలాదేవి, హైదరాబాదు వాస్తవ్యలు ఈ రోజు శ్రీ విఘ్నేశ్వర
స్వామి వారిని దర్శించి నిత్య అన్నదాన పధకమునకు విరాళముగా రూ.10,000/-
యిచ్చినారు. అనంతరం ఆలయ చైర్మన్ గారు స్వామివారి క్యాలెండర్, ప్రసాదములను
అందజేశారు.
11-1-2016
చదువుల పండుగ - 2016 సం. సంబందించి కలముల ఎంపిక కొరకు ఈ రోజు టెండర్లు జరిగినవి.
ఆలయ చైర్మన్ గారు టెండరు బాక్సును తెరచినారు. మూడు రకముల కంపెనీ వారు వచ్చినారు.
1) Reynolds 2) Flair 3) Linck కంపెనీ వారు హాజరైనారు. వీటిలో ఒక దానిని ఎంపిక
చేస్తారు.
06-01-2016
రాజమండ్రి జిల్లా జడ్జి గౌ.శ్రీ రవీంద్రబాబు గారు కుటుంబ సమేతముగా శ్రీ స్వామి వారిని
దర్శించి శ్రీ స్వామి వారి ఆశీస్సులు పొందినారు.
01-01-2016
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి సన్నిదిలో నూతన సంవత్సర 2016 క్యాలెండర్ ఆవిష్కరించిన స్ధానిక శాసన సభ్యులు గౌ. శ్రీ పి. నారాయణ మూర్త్ గారు,
ఈ రోజు (ది.15-12-15) అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి సన్నిదిలో కార్తీక మాసము హుండీ లెక్కింపు జరిగినది. ఈ లెక్కింపులో ఆలయ చైర్మన్, తనిఖీదారు, కార్యనిర్వహనాధికారి వారు, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. 43 రోజులకు గాను మొత్తం అదాయం రూ.12,35,185/- వచ్చినది. గత కార్తీక మాసం హూండీ ఆదాయం 56 రోజులకు గాను రూ.12,88,219/- వచ్చినది.
10-12-2015 ఉదయం శ్రీ స్వామి వారి సన్నిదిలో గోపూజ మహోత్సవం నిర్వహించబడును
శ్రీమతి&శ్రీ మంథా సత్యనారాయణ, పేరూరువారు ఈ రోజు శ్రీ స్వామి వారిని దర్శించిన సందర్బములో నిత్య అన్నదాన పధకమునకు విరాళముగా రూ.11,500/- యిచ్చినారు. వీరికి ప్రధాన అర్చకులు స్వామి వారి చిత్ర పటమును అందజేశారు.
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్దానము నందు యాత్రికుల వసతి సముదాయ భవనమునకు శంకుస్థాపన చేసిన టి.టి.డి చైర్మన్ శ్రీ చదలవాడ కృష్ణమూర్తి, హోంమంత్రి వర్యులు చినరాజప్ప గారు. బోర్డు సభ్యురాలు శ్రీమతి అనంత లక్ష్మి గారు, మరియు స్ధానిక ఎం.ఎల్.ఎ శ్రీ పి. నారాయణ మూర్తి గారు
చింతనలంక వాస్తవ్యలు, సర్పంచిల సమాఖ్య అధ్యక్షుడు శ్రీ విల్ల రామ్ మనోహర్ గోపీనాథ్ గారు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్బములో నిత్య అన్నదాన నిమిత్తం విరాలముగా రూ.1,01,116,/- ను కార్యనిర్వహణాధికారి వారికి అందజేశారు. శేష వస్త్రముతో సత్కరించి స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేశారు
శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంనకు నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు అయినది తొలుత కార్యనిర్వహణాదికారి వారు స్వాగతము పలికి, పుష్ప గుచ్ఛములు అందజేశారు. తణిఖీదారు వారు వీరిచేత ప్రమాణ స్వీకారం చేసినారు. చైర్మన్ గా శ్రీ రావిపాటి సుబ్బరాజు ప్రమాణ స్వీకారం చేసినారు. వీరిని పలువురు అభినందించారు
16-11-2015:రూ.22,400/- విలువైన 7 అడుగులు పొడవు గల 56 kg బరువు గల స్టీల్ ss 304 క్వాలిటీతో బోజనాల బల్లను శ్రీ తాడి నరశింహారావు, ఈదల సత్తిబాబు గార్లు బహుకరించినారు వీరికి ఆలయ ప్రదాన అర్చకులు స్వామి వారి చిత్ర పటమును అందజేశారు
15-11-2015: తణుకు వాస్తవ్యలు, శ్రీ కలిశెట్టి శ్రీనివాస్ గారు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్బములో శ్రీమతి&శ్రీ కె.నరేంద్ర కుమార్ , సుజాత దంపతులు పేరు మీద నూతనముగా నిర్మిచిన అన్నదాన భవనము నందు భక్తులు కూర్చోని బోజనం చేసేందుకు వీలుగా నాణ్యమైన స్టీల్ బెంచ్, కూర్చీలు నిమిత్తం విరాలముగా రూ. 1,12,000,/-. వీరిని ప్రధాన అర్చకులు శేష వస్త్రముతో సత్కరించి స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను అందజేశారు.
29-07-2015: శ్రీ స్వామి వారి హూండీ ఆదాయం 19 రోజులకు గాను మొత్తం రూ.8,68,763/- వచ్చినది. ఈ లెక్కంపు ఆలయ తణిఖీదారు శ్రీ జంపా రామలింగేశ్వర రావు గారు పర్యవేక్షణలో జరిగినది.
12-07-2015: ఈ రోజు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన దేవాదాయ శాఖ మంత్రి గౌ. శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు. వీరికి తొలుత కార్యనిర్వాహనాధికారి వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదములను అందజేసినారు. అనంతరం అన్న ప్రసాదము స్వీకరించి పుష్కర ఏర్పాట్లు గురించి తెలుసుకున్నారు. వీరి వెంట ZPTC, MPP మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
22-06-2015: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్య మంత్రి గౌ. శ్రీ చిన్నరాజప్ప గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గౌ. శ్రీ నామన రాంబాబు గారు, మరియు స్థానిక శాసన సభ్యులు గౌ. శ్రీ పి. నారాయణ మూర్తి గారు ఈ రోజు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి వారిని దర్శించి, శ్రీ స్వామి వారి ఆశీస్సులు పొందినారు. తొలుత కార్యనిర్వాహణాధికారి వారు పుష్పగుచ్చంతో స్వాగతం పలకి, మరియు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినారు. అనంతరం స్వామి వారి ప్రసాదములను వారికి అందజేసారు
02-06-2015: శ్రీ స్వామి వారి దేవస్ధానములో ఈ రోజు హూండీ లెక్కింపు జరిగినది. 33 రోజులకు గాను రూ.9,52,725/- వచ్చినది. ఈ లెక్కింపు ఆలయ తణిఖీదారు వారు శ్రీ జంపారామలింగేశ్వరరావు గారి ఆద్వర్యములో జరిగినది. కార్యనిర్వాహణాధికారి వారు, ఆలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
14-04-2015: గౌ. శ్రీ. కె.వి. ఆర్. సాయికుమార్ , డిప్యూటీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు ఈ రోజు కుటుంబ సమేతముగా అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి , శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేకము నిర్వహించినారు, వీరికి మొదట కార్యనిర్వహణాధికారి వారు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శేష వస్త్రముతో సత్కరించి, శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని మరియు ప్రసాదములను అందజేసారు.
13-04-2015: తూ. గో. జిల్లా, రాజమండ్రి వాస్తవ్యలు శ్రీమతి & శ్రీ బులుసు వెంకటేశ్వర్లు గారు ఈ రోజు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో నిత్య అన్నదాన పధకమునకు విరాళముగా రూ.10116/- యిచ్చినారు. వీరికి ఆలయ పర్య వేక్షకులు వారు శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని మరియు ప్రసాదములను అందజేసారు.
12-04-2015: తూ. గో. జిల్లా, కొత్తపేట గ్రామ వాస్తవ్యలు శ్రీమతి & శ్రీ గాడిచర్ల కృష్ణమూర్తి, సత్యకళ దంపతులు ఈ రోజు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన సందర్భములో నిత్య అన్నదాన పధకమునకు విరాళముగా రూ.10116/- యిచ్చినారు. వీరికి ఆలయ సిబ్బంది శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని మరియు ప్రసాదములను అందజేసారు.
08-04-2015: అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించిన తూ. గో. జిల్లా. అధనపు జాయింట్ కలెక్టర్ గౌ. శ్రీ డి. మార్కండేయులు గారు. వీరికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి, శేష వస్త్రముతో సత్కరించి, అర్చకులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదములను అందజేసారు.
03-04-2015: గౌ. శ్రీ ఎన్. జానకి రామారావు, జుడీషియల్ మెంబర్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, హైదరాబాద్ వారు, ఈ రోజు సతీసమేతముగా అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించినారు. వీరికి ఆలయ అధికార్లు స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం చేసి, శ్రీ స్వామి వారి చిత్రపటాన్ని అందజేసారు.
03-04-2015: ఆంధ్రప్రదేశ్, హైకోర్టు ట్రిబ్యునల్ జడ్జి, గౌ. శ్రీ వ్యాఘ్రేశ్వర శివ శంకర్ శర్మ గారు ఈ రోజు అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించినారు, వీరికి ఆలయ సిబ్బంది స్వాగతం పలికి, ప్రసాదములను అందజేసారు.
01-04-2015: అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి త్వరలో నూతనముగా ప్రారంభించదలచిన పంచామృతాభిషేకంనకు ద్రవ్యములు భక్తులు వారి స్వహస్తములతో అలయములోనికి తీసుకుని వెళ్ళుటకు అవసరమైన చిన్న చిన్న వెండి బిందెలు 5, మరియు వాటికి అవసరమైన పళ్ళెమును అమలాపురం మండలం, పాలగుమ్మి గ్రామవాస్తవ్యలు శ్రీమతి ముదునూరి వెంకట సుబ్బలక్ష్మి గారు సుమారు రూ.15,000/- చేయించి శ్రీ స్వామి వారికి సమర్పించినారు. ఈ విరాళమును ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అయినవిల్లి సురేష్ గారికి అందజేసారు.
జై గణేష్..! జై జై గణేష్ ...!! ఈ రోజు ఐనవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానము నందు రెండు తెలుగు సంవత్సరముల కాలమునకు (ది.13-09-2018 నుండి ది.22-08-2020 వరకు) కొబ్బరి చెక్కలు పోగుచేసుకును హక్కునకు దేవదాయ-ధర్మదాయ శాఖ అధికారుల సమక్షములో టెండర్ కం-బహిరంగ వేలం జరిగినది. హెచ్చు పాట రూ.38,05,000/- లకు తిమ్మాపురం వాస్తవ్యులు శ్రీ ముద్దన శ్రీనివాస రావు గారు పాట పాడుకుని యున్నారు. దీని పై రెండవ సంవత్సరం 10% అధనముగా చెల్లించి నిర్ణయం. గత సంవత్సరం పాట రూ.25,90,000/-లుగా యున్నదని మనవి చేయుచున్నాను
దేవదాయ-ధర్మదాయ శాఖ, ప్రాంతీయ సంయుక్త కమీషనర్ శ్రీ వై. త్రినాధ రావు గారు, డిప్యూటీ కమీషనర్, శ్రీ డి.ఎల్.వి.రమేష్ బాబు గారు మరియు అధికారులు ఈ రోజు ఐనవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించినారు. వీరికి కార్యనిర్వహణాధికారి వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికినారు. అనంతరం దేవస్థానము నందు బుద్దవరపు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చెయ్యనున్న నవగ్రహ టెంపుల్ స్థలమును పరిశీలించినారు .