చదువుల పండుగ:
వ్యాసమహర్షి భారతమును రచించినపుడు విద్యాబలంగల శ్రీ విఘ్నేశ్వరుని వ్రాయమని కోరడమైనది. అందున ఆ గ్రంధాన్ని అత్యంత వేగవంతముగా వ్రాయుట జరిగినది మరియు విద్యారంభే అను శ్లోకములో వినాయకుని పూజ చేయుట జరిగినది. కావున శ్రీస్వామి వారి కరుణాకటాక్షముతో విద్యార్ధిని విద్యార్ధులు అందరూ ఉత్తమమైన ఉత్తీర్ణత సాధించుటకు ప్రతి సంవత్సరం శ్రీ స్వామి వారికి లక్ష దూర్వములతో పూజించి తదుపరి లక్ష కలములను శ్రీ స్వామి వారి పాదముల చెంత ఉంచి తదుపరి ఆ కలములను విద్యార్ధిని విద్యార్ధులకు ఉచితముగా వితరణ చేయబడును.
ఆ పై విరాళములు ఇచ్చు దాతలు యొక్క గోత్రనామాలతో పూజ జరిపించుటఏకాక ప్రసాదముగా కలములను తపాలా ద్వారా పంపించబడును