ఆలయ అభివృద్ధి నిమిత్తం - విరాళములు
కొత్తగా నిర్మించుటకు సంకల్పించిన శాశ్వత నిత్య అన్నదాన నూతన భవన నిర్మాణం
"భిక్షాందేహీ కృపావలంబనకరీ...! మాతాన్నపూర్ణేశ్వరీ"...!
సర్వమంగళ కారిణీ...! ఈశ్వర స్వరూపిణీ...!
సాక్షాత్తు అన్నపూర్ణ దేవీ సమక్షంలో శ్రీ సిద్ది వినాయక స్వమి వారి ఆలయంలో నిత్య అన్న ప్రసాదము
అక్షయముగా జరుగుతున్నదని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము.
ఇందులో మీరు భాగస్వాములు అయినందుకు శ్రీ సిద్ది వినాయక స్వామి వారి కృపా కటాక్షములు మీ యందు ఉండుననీ "అన్ని దానములలో కెల్ల అన్నదానము అతి పవిత్రమైనదిగా" భావించి మీ యొక్క సహకారంతో నడుస్తున్న ఈ నిత్య అన్న ప్రసాద కార్యక్రమము ప్రస్తుతం రేకుల షెడ్డులో జరుగుతున్నది. ఇది మీకు విదితమే.
అయితే ఇటీవల నూతన భవనమును నిర్మించుటకు సంకల్పించినాము. సదరు నిర్మాణ వంటశాల మరియు సుమారు 500 మంది ఒకేసారి కూర్చుని అన్న ప్రసాదం స్వీకరించు విధముగా రూపకల్పన చేసియున్నము.
దీనికిగాను సుమారు "2కోట్ల" రూపాయలు వ్యయము అగుచున్నది. కావున ఈ పవిత్ర కార్యములో మీరు భాగస్వాములు అవుతారనే ఆశిస్తూ కనీస మొత్తంగా 2,000/- రూపాయిలుగా నిర్ణయించి ఆపై భక్తులు యొక్క అభీష్టము మేరకూ ఇచ్చు విధముగా నిర్ణయించుట జరిగినది.
కావున, శ్రీ విఘ్నేశ్వర స్వామి నిత్య అన్న ప్రసద కార్యమము మరింతమరింత అద్బుతముగా జరిపించుటకు మీవంతుగా నూతన భవన నిర్మణమునకు సహకరించగలరని కోరిప్రార్ధించుచున్నను.
విరాళములు డి.డి గాని, చెక్ రూపంలో ఉండవలెను.వీటిని అయినవిల్లి నందు చెల్లు విధముగా ఇవ్వవలెను.
శ్రీ విఘ్నేశ్వరస్వామివారి దేవస్థానం.